Total Pageviews

Labels

Sunday 16 March 2014

చేయుతనిద్దాం


పాపం, పుణ్యం, ప్రపంచమార్గం-కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ....ఏమీ ఎరుగని పూవుల్లాగా ,
మెరుపు మెరిస్తే,వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తే అవి మాకే అని ఆనందించాల్సిన  కూనల్లాగా 
అచ్చటికిచ్చటి కనుకోకుండాఎచ్చటెచటికో 
ఈలలు వేస్తూ ఎగురుతు పోవాల్సిన  ఆ బాలలు 
పెద్దలు చేసిన తప్పులు మూలం గా హెచ్ ఐ వీ బారిన పడి జీవచ్చవాలుగా మారుతున్నారు.
 ఏ సహాయం అందక ,చేయూత నిచ్చే వారు లేక, నిర్లక్ష్యానికి గురై మొగ్గలుగానే రాలి పోతున్నారు.
వీరిలో ఎఫెక్టేడ్, ఇన్ఫెక్టేడ్ బాలలు వున్నారు.
ఎఫెక్టేడ్ బాలల కంటే ఇన్ఫెక్టేడ్ బాలల పరిస్తితి మరీ ఘోరం
పేదరికంలో ఉన్న కుటుంబాలకు చెందిన వారి పరిస్తితి అయితే మరీ దుర్భరం. ఇంకొందరు కొద్ది పాటి సహాయం అందుకొని  బతుకు బండి లాగుతున్నారు .....
కొందరేమో ట్రాఫికింగ్ బారిన పడి  వ్యభిచార గృహాలలో మగ్గి  పోతుంటే....  ...
మరికొందరు  భిక్షగాళ్ళ గా ,బాల కార్మికులుగా  మారి  పొట్ట పోసుకుంటున్నారు ...
ఏ అధరువు దొరకక ఇంకొందరు అధోజగత్ సహోదరులుగా మారి పోతున్నారు .
ఇది క్లుప్తం గా నేటి బాలల పరిస్తితి.
వీరందరిది నిస్సహాయ స్థితే. అలాంటి వారిని కొందరినైనా ఆదుకోవాలన్న సంకల్పం తో ఈ "
ఆర్ణవి "పుట్టుకొచ్చింది.రండి చేయి కలపండి.నిస్సహాయులకు చేయూత నిద్దాం

No comments:

Post a Comment