
Monday, 17 March 2014
మనసు ఉండాలే కానీ మార్గాలు బోలెడు !
సహాయం చేయడం లో వున్న తృప్తి మరెందులో లేదు !
సహాయం గా మనం ఏమి ఇస్తున్నామన్నది ముఖ్యం కాదు!
ఎంత ప్రేమగా ఇస్తున్నాం అన్నది ప్రధానం!
మనం అందరికి సహాయం చేయలేకపోవచ్చు!
కానీ కొందరిని మాత్రం ఆదు కోగలం !
అసలు సహాయ పడాలన్న భావన ఉంటె చాలు !
సహాయాన్ని డబ్బుతో ముడి పెట్టనక్కరలేదు.
మనకు చేతనైనంతలో ఇతరులకు సహాయపడవచ్చు!
మనసు ఉండాలే కానీ మార్గాలు బోలెడు !
దేశంలో, రాష్ట్రం లో జిల్లాలో మన సహాయం కోసం ఎదురు
చూస్తున్న నిస్సహాయులు ఎందరో ఉన్నారు !
ఏ సహాయం చేయకపోయినా "మాట సహాయం "కూడా చేయవచ్చు!
ఈ సంస్థ గురించి పదిమందికి చెప్పవచ్చు !
సంస్థ లో "సభ్యులు "గా చేర వచ్చు !
"ప్రచారోద్యమం " లో పాలు పంచుకోవచ్చు!
సంస్థ గురించి తెలుసు కోవాలనుకుంటున్నారా ?
ఈ సంస్థ పేరు"" ఆర్ణవి ""
ఆపదలో ఉన్నవారికి, చేయూత అవసరమైనవారికి సహాయ పడటమే సంస్థ లక్ష్యం!
అది ఎలా అంటే ?ఈ బ్లాగ్ లో సహాయం అవసరమైన నిస్సహాయులు గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుంటాం.
మీరు కూడా నిస్సహాయుల సమాచారం మాకు పంపవచ్చు.
వారికి మీరు నేరుగా సహాయ పడవచ్చు ... లేదా మా ద్వారా సహాయ పడవచ్చు.
మేము వారికి మా వాలంటీర్ల ద్వారా మీ సహాయాన్ని అందిస్తాం.
మీరు డబ్బులే పంపాల్సిన పనిలేదు.సహాయ పడే సంస్థల లేదా వ్యక్తుల సమాచారాన్ని పంపవచ్చు.
మొత్తం మీద ఎలాగైనా నిస్సహాయులకు చేయూత నివ్వవచ్చు.
ఒక మంచి సంకల్పం తో ప్రారంభించిన ఈ "ఆర్ణవి " తో చేతులు కలపండి.
ఎందరికో సహాయ పడండి..తద్వారా సంతోష పడండి.
మీ పిల్లల పుట్టిన రోజు సందర్భంగానో ,మీ ఆత్మీయుల స్మృతి కి గుర్తుగానో చిన్న మొత్తాలను విరాళం గా పంప వచ్చు.
Sunday, 16 March 2014
చేయుతనిద్దాం
మెరుపు మెరిస్తే,వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తే అవి మాకే అని ఆనందించాల్సిన కూనల్లాగా
అచ్చటికిచ్చటి కనుకోకుండాఎచ్చటెచటికో
ఈలలు వేస్తూ ఎగురుతు పోవాల్సిన ఆ బాలలు
పెద్దలు చేసిన తప్పులు మూలం గా హెచ్ ఐ వీ బారిన పడి జీవచ్చవాలుగా మారుతున్నారు.
ఏ సహాయం అందక ,చేయూత నిచ్చే వారు లేక, నిర్లక్ష్యానికి గురై మొగ్గలుగానే రాలి పోతున్నారు.వీరిలో ఎఫెక్టేడ్, ఇన్ఫెక్టేడ్ బాలలు వున్నారు.
ఎఫెక్టేడ్ బాలల కంటే ఇన్ఫెక్టేడ్ బాలల పరిస్తితి మరీ ఘోరం
పేదరికంలో ఉన్న కుటుంబాలకు చెందిన వారి పరిస్తితి అయితే మరీ దుర్భరం. ఇంకొందరు కొద్ది పాటి సహాయం అందుకొని బతుకు బండి లాగుతున్నారు .....
కొందరేమో ట్రాఫికింగ్ బారిన పడి వ్యభిచార గృహాలలో మగ్గి పోతుంటే.... ...
మరికొందరు భిక్షగాళ్ళ గా ,బాల కార్మికులుగా మారి పొట్ట పోసుకుంటున్నారు ...
ఏ అధరువు దొరకక ఇంకొందరు అధోజగత్ సహోదరులుగా మారి పోతున్నారు .
ఇది క్లుప్తం గా నేటి బాలల పరిస్తితి.
వీరందరిది నిస్సహాయ స్థితే. అలాంటి వారిని కొందరినైనా ఆదుకోవాలన్న సంకల్పం తో ఈ "ఆర్ణవి "పుట్టుకొచ్చింది.రండి చేయి కలపండి.నిస్సహాయులకు చేయూత నిద్దాం
Subscribe to:
Posts (Atom)