ఈ ఫోటోలో కన్పించే అమ్మాయి పేరు మేరీ. నెల్లూరు జిల్లా కు చెందిన ఈ
పాప తీవ్ర అనారోగ్యానికి గురైంది.వైద్యులు పరిశీలించి గుండెలో చిల్లులు
ఉన్నాయని నిర్ధారించారు. మూడు లక్షలు వైద్య చికిత్సకు అవసరం అవుతాయని
చెప్పారు.ఆరోగ్యశ్రీ కార్డు వున్నా చికిత్స లభించలేదు. నిరు పేద
కుటుంబానికి చెందిన తల్లి తండ్రులు ఎం చేయాలో దిక్కు తోచక విలపిస్తుండగా
సాక్షి చానల్ పాపకు అండగా నిలిచింది .పాపతో ,ఆమె తల్లితో ఇంటర్వ్యూ ని
ప్రసారం చేసింది.స్పందించిన దాతలు లైవ్ లోనే సహాయం చేస్తామని హామీ
ఇచ్చారు.మీరు కూడా ఏదైనా సహాయం చేయవచ్చు.పాప తల్లి ఫోన్ నంబర్ ,అకౌంట్
నంబర్ ఫోటోలో వున్నాయి చూడండి.మాట్లాడండి.మీకు తోచిన సహాయం చేయండి.
No comments:
Post a Comment